Wednesday, July 18, 2007
నడక
నిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..
తెలియకుండా జరిగేది పుట్టుక
ఎప్పుడు వస్తుందో తెలియనిది చావు
చావు పుట్టుకుల మద్య వంతెన జీవితం
నిలపలేని నడక సమయం
గడిచే ప్రతి క్షణం గమ్యం వైపే
అనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!
Sunday, June 17, 2007
ఎక్కడికో
ఆకాశం రంగులు అద్దుకుంది
చుక్కలన్నీ చందమామలు
రెక్కలు లేని పక్షిని నేను
దిక్కులుమరచి హద్దులు విడిచి
లక్షం అంటు లేకుండా అలా అలా
నిన్నటి గాయం మరచి
రేపటి దిగులు వదలి
ఈ క్షణం నా సొంతమనుకొని
అనుభవిస్తూ అనందిస్తూ
ఎక్కడికో ఏదరికో?
Dog Day Afternoon
As usual I was spending my weekend watching DVDs, then I suddenly I found this AL Pacino movie "Dog Day Afternoon". I would say this is father ()of all hostage drama I have seen so far. Its funny in a way and very entertaining. With this movie I had a well spent Sunday after noon.
Wednesday, June 06, 2007
ఆ నవ్వు..
నేను ఎమన్నానని ఇప్పుడు
దేశం పైకి పోతుందన్నాను
జనానికి ఆకలన్టే తెలియదన్నాను
దేశం దాన్యాగారమన్నాను
రైతే రాజన్నాను
అలా విరగబడి నవ్వుతావెందుకు
కులమతాలు అస్సలు లేవన్నను
రాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నాను
ప్రభుత్వం ప్రజలకోసమే అన్నాను
అవినీతి అన్టే ఎరగమన్నాను
మళ్ళా.. ఆనవ్వేమిటి దాని అర్దమేమిటి
Monday, June 04, 2007
జీవితం
చీ జీవితం, ఏమిటి దీని అర్దం అని
నాకు సమాధానం దొరికింది
జీవితం "జీవించ"డానికి కాదని
జీవితం అనుభవించడానికని
ఎవరినీ ఉద్దరించనక్కర్లేదని
నన్ను నేను ఉద్దరించుకుంటే చాలునని
నాకు నచ్చినది, నేను అనుకున్నది
సాదించి ఆనందించడమే "జీవితం" అని
Thursday, May 31, 2007
కల
కనులతో ఊసులాడుతూ
నేను కవినని నాకు గుర్తుచేసి
ఏదో ఒకటి రాయమని
ఉత్సాహం నింపి కలం చేతికిచ్చి
చటుక్కున మయమయ్యింది...
ఎవరది నన్ను నిద్ర లేపింది?
అరే ఎవరది నాకల చిదిమేసింది?
ఏమి రాయను మరి ఇప్పుడు నేను?
కలలో ఉండి నిజాన్ని మరువనా?
నిజానికి వచ్చి కలను ఙ్నాపకంగా దాచుకోనా?
Sunday, May 27, 2007
“The population is divided into vertical compartments of provinces, tribes, clans, casts, and sub-castes. People generally do not vote out across these compartments or across their tribe, caste, or clan boundaries. The existing system creates the illusion of democracy because we do have election; but we forget that elections are but a tool of democracy an end in themselves. The above system always gives power to small elite group comprises of feudal leaders.”
Though the above statement is written by a dictator (Mr. Musharraf) about Pakistan, the same statement is very true for our country. In the 60 years of independence we have been ruled by a family for 35 years (I may have to add 3 more years for Mr.Singh regime) and by a party for 40+ years which the family represents (I may have to say the party represents the 'Gandhi&Nehru' family).
The perfect example is recent UP election verdict, the lady who has just been elected by UP people is a shameless corrupt. The government at center is run by multiple people with conflicting interests. Recently Mr. Singh has issued a statement saying that rich people in the country should restrain from showing their wealth, which may cause revolution in poor. I have a question to Mr. Singh what about the tax payers, they are paying tax with the hope government will do something to improve the lives of non-privileged people by providing opportunities, but more than half of the tax payers money going into pockets of corrupted politicians and officials. I think he should concentrate on spending the tax payers money properly instead of talking like a communist. What if all the tax payers in the country denies to pay tax because the money which they are paying from their hard earned money is going into the pockets of some crooks.
Monday, March 26, 2007
నాకు ఏమి తెలుసు ?
ఏదో ఒకటి రాద్దామని
కలం నింపి అరఠావు పట్టి
పడక కుర్చీ వాల్చి
ఆకాశం వైపు చూస్తూ
ఏమి రాయడమా అని
ఆలోచనలో మునిగి కూర్చున్నా
నాగురించి నేను రాసుకుందామంటే
రహస్యం రాసిపెట్టకూడదే
లోకం గురించి రాద్దామంటే
లోకమేమిటో నాకు తెలియదే
తెలిసిన దాని గురించి రాద్దామని
నాకేమయినా తెలుసునేమొనని
ఆలోచిస్తూ అకాశం వైపు చూస్తూ కూర్చున్నా..
చీకటి పడి ఆకాశం కనుమరుగయ్యింది"
Monday, February 26, 2007
వీడు
అందగాడు అసాధ్యుడు
పెంకివాడు కొంటెవాడు
దైవం దెయ్యం లేదంటాడు
ఆకాశం వైపు చూస్తుంటాడు
అందుకోవాలని ఆశ పడతాడు
ప్రయత్నంతో పైకెగురుతాడు
ఓరచూపుకు కోరచూపు విసురుతాడు
అబద్దం అవమనం క్షమించడు
ఆలోచనలో మునిగితేలుతాడు
వెన్నెలల్లె నవ్వుతాడు
వాడిలోకమె వాడిదంటాడు"
Tuesday, February 20, 2007
Monday, January 29, 2007
Political solution to India's problems
Monday, January 15, 2007
We don’t have right to Criticize
Friday, January 12, 2007
సంక్రాంతి
తూరుపు ఎరుపెక్కకముందే
జేబులో అగ్గిపెట్టెతో బోగి మంట సరదాతో
వరిగడ్డి వామిపైకి దండయాత్ర నాన్నతో యుద్దం
చివరికి సంధి రెండో మూడో గడ్డికట్టలతొ మంట సిద్దం
తలంటు యుద్దం కళ్ళు మండితే రాగం
కొత్తబట్టలతో నోట చెక్కెరతో సరాగం
నాన్నతో పోటీ తిన్న గారెల లెక్కలువేస్తూ
కోడిపందాలాటలో సందడికి పరుగులు
రోజంతా సందడి ఎక్కడ చూసినా కేరింతలు
సాయంత్రానికి వెళ్ళిపోతున్న పండగపై బెంగ
మరుసటి పండుగకు ఏమిచేద్దామన్న అలోచనతో జోగిపోవడం
మళ్ళా సంక్రాంతి వచ్చింది ఏమి చేస్తున్నారు మరి మీరంతా?
Wednesday, January 03, 2007
Saturday, December 30, 2006
మరో కొత్త సంవత్సరం
మరో మంచి అవకాశం
కొత్త తప్పులు చెయ్యడనికి
పాత పాఠం గుర్తువున్నదికదా
పాత తప్పులు చెయ్యకుండటానికి
కొత్త అశలకు
పాత అశలలో కొన్ని నిరశలు
ఆ నిరాశలు మర్చిపో పాతవైపొయ్యావవి
కొత్త ఆలోచనలకు
పాత కొత్త ఆలోచనకు పునాది
పాత ఆలోచనకు హంగులద్దకు కొత్తదనకు
కొత్తది ప్రతి క్షణం
ఈక్షణం పాతదవుతుంది మరుక్షణం
గడిచిన ప్రతి క్షణం చరిత్రసొంతం
మరో కొత్త సంవత్సరం
మరో మంచి అవకాశం
Wednesday, December 13, 2006
Who am I? Post-1
Last night I had asked the same question to myself, first I didn't know the answer later I realized that “I am none other than GOD” hurry! now I know. I don't forgive any one who commits sins against me( this is what exactly my believers[I told you that I am GOD] think and I will send sinners to hell). OK don't be confused I will explain the terms hell and sin.
Hell : You might had never seen it but might had felt it, hell is a constant fear in your mind(brain)(I don't believe in “thinking with heart” or “feeling in heart”, heart is just a organ which pumps blood into your body machine, if you think your heart thinking and feeling you better go for a heart check).
Sin : You say something and you don't really believe or mean what you said. There are many synonyms for sin lie,disloyalty etc are sins.
If you think I am not GOD, I challenge you to prove it. Every day I will post justifications to prove that I am GOD. Watch this space....... :)
Sunday, December 10, 2006
మన లోకం
ఆవేశం మన ఆయుధం
ఆలోచన మన సిద్ధాంతం
మన ఆవేశాన్ని జ్వాలగ మార్చి
ఇలా ఉన్న ఈలోకాన్ని మార్చి
ఈ లోకం ఇలా ఉండాలని
మనం కన్నకలలు నిజం చేసుకొందాం
మనం అనుకున్న మనలోకాన్ని సృష్టించుకుందాం రండి"
Monday, December 04, 2006
అదిగో పిలుస్తున్నది నవచైతన్యం
ఆయుధం చేతపట్టి అడవులవెంటపడి
ఆదర్శం మరచి ఆలోచనమాని
అక్షరమ్ దిద్దవలసిన చేతులతో అయుధం మొయిస్తూ
అసలు విప్లవం మరచి అదో లోకంలో ఉన్న అన్నలారా..
ఆపండిక ఈ ఉగ్రవాదం అదిగో పిలుస్తున్నది నవచైతన్యం"
