Sunday, June 17, 2007

ఎక్కడికో

ఆకాశం రంగులు అద్దుకుంది
చుక్కలన్నీ చందమామలు
రెక్కలు లేని పక్షిని నేను
దిక్కులుమరచి హద్దులు విడిచి
లక్షం అంటు లేకుండా అలా అలా
నిన్నటి గాయం మరచి
రేపటి దిగులు వదలి
ఈ క్షణం నా సొంతమనుకొని
అనుభవిస్తూ అనందిస్తూ    
ఎక్కడికో ఏదరికో?

Dog Day Afternoon

As usual I was spending my weekend watching DVDs, then I suddenly I found this AL Pacino movie "Dog Day Afternoon". I would say this is father (smile_nerd)of all hostage drama I have seen so far. Its funny in a way and very entertaining. With this movie I had a well spent Sunday after noon.

For those who don't know Al Pacino, he is the Scar face guy and the guy who acted the title role in God Father III, what a gifted actor he is, splendid performances. Coming to the story of the movie its a quite simple, two(actually three; watch the movie to find out what happened to the third one) disparate guys tries to rob a bank and found themselves with almost empty safe and bunch of ladies who work in that back as hostages(obviously police come into the seen), then starts the cat and mouse play. The way its been presented is great and some way it reflects 1972 American society. Watch this movie you will like it smile_wink

Wednesday, June 06, 2007

ఆ నవ్వు..

అరే అలా నవ్వుతావెందుకు
నేను ఎమన్నానని ఇప్పుడు
దేశం పైకి పోతుందన్నాను
జనానికి ఆకలన్టే తెలియదన్నాను
దేశం దాన్యాగారమన్నాను
రైతే రాజన్నాను
అలా విరగబడి నవ్వుతావెందుకు
కులమతాలు అస్సలు లేవన్నను
రాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నాను
ప్రభుత్వం ప్రజలకోసమే అన్నాను
అవినీతి అన్టే ఎరగమన్నాను
మళ్ళా.. ఆనవ్వేమిటి దాని అర్దమేమిటి

Monday, June 04, 2007

జీవితం

ప్రతి క్షణం అనిపించేది
చీ జీవితం, ఏమిటి దీని అర్దం అని
నాకు సమాధానం దొరికింది
జీవితం "జీవించ"డానికి కాదని
జీవితం అనుభవించడానికని
ఎవరినీ ఉద్దరించనక్కర్లేదని
నన్ను నేను ఉద్దరించుకుంటే చాలునని
నాకు నచ్చినది, నేను అనుకున్నది
సాదించి ఆనందించడమే "జీవితం" అని