Monday, June 04, 2007

జీవితం

ప్రతి క్షణం అనిపించేది
చీ జీవితం, ఏమిటి దీని అర్దం అని
నాకు సమాధానం దొరికింది
జీవితం "జీవించ"డానికి కాదని
జీవితం అనుభవించడానికని
ఎవరినీ ఉద్దరించనక్కర్లేదని
నన్ను నేను ఉద్దరించుకుంటే చాలునని
నాకు నచ్చినది, నేను అనుకున్నది
సాదించి ఆనందించడమే "జీవితం" అని

3 comments:

  1. సంతోషం. నేనూ మీతో ఏకీభవిస్తాను. ఇప్పుడు "నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలు" అంటే ఏమిటనే విషయంలో మీకు స్పష్టత ఉందా? ఉద్ధరేత్ ఆత్మనాత్మానమ్ అన్న గీతాచార్యుని మాటకూ మీ ఆలోచనలకూ పోలికలేమైనా ఉన్నాయా? నిన్ను నీవు ఎలా ఉద్దరించుకుంటావు? దేన్ని ఉద్ధరణ అంటారు?

    ReplyDelete
  2. ఏమో దీనిమీద అంత తొందరగా ఒక నిర్ణయానికి నేను రాలేను.

    జీవితాన్ని ఎలా జీవిస్తే పరిపూర్ణంగా జీవించడం, ఎలా జీవిస్తే జీవితానికి సార్థకత అనేవి ఇంకా సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే నాకు.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  3. బాగుంది!

    ReplyDelete