Friday, January 12, 2007

సంక్రాంతి

అమ్మ అయినా నిద్రలేవకముందే
తూరుపు ఎరుపెక్కకముందే
జేబులో అగ్గిపెట్టెతో బోగి మంట సరదాతో
వరిగడ్డి వామిపైకి దండయాత్ర నాన్నతో యుద్దం
చివరికి సంధి రెండో మూడో గడ్డికట్టలతొ మంట సిద్దం
తలంటు యుద్దం కళ్ళు మండితే రాగం
కొత్తబట్టలతో నోట చెక్కెరతో సరాగం
నాన్నతో పోటీ తిన్న గారెల లెక్కలువేస్తూ
కోడిపందాలాటలో సందడికి పరుగులు
రోజంతా సందడి ఎక్కడ చూసినా కేరింతలు
సాయంత్రానికి వెళ్ళిపోతున్న పండగపై బెంగ
మరుసటి పండుగకు ఏమిచేద్దామన్న అలోచనతో జోగిపోవడం
మళ్ళా సంక్రాంతి వచ్చింది ఏమి చేస్తున్నారు మరి మీరంతా?

1 comment:

  1. చాలా బావుంది.ఎక్కడికో తీసుకెళ్లారు.మళ్లీ పండగ వచ్చిందంటు అక్కడే ఆపి తీపి ఙ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

    ReplyDelete