Monday, March 26, 2007

నాకు ఏమి తెలుసు ?

"చాలా కాలమయ్యిందని
ఏదో ఒకటి రాద్దామని
కలం నింపి అరఠావు పట్టి
పడక కుర్చీ వాల్చి
ఆకాశం వైపు చూస్తూ
ఏమి రాయడమా అని
ఆలోచనలో మునిగి కూర్చున్నా
నాగురించి నేను రాసుకుందామంటే
రహస్యం రాసిపెట్టకూడదే
లోకం గురించి రాద్దామంటే
లోకమేమిటో నాకు తెలియదే
తెలిసిన దాని గురించి రాద్దామని
నాకేమయినా తెలుసునేమొనని
ఆలోచిస్తూ అకాశం వైపు చూస్తూ కూర్చున్నా..
చీకటి పడి ఆకాశం కనుమరుగయ్యింది"

4 comments:

  1. మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
    www.thenegoodu.com

    ఇట్లు
    గౌరి శంకర్

    ReplyDelete
  2. ఏమి రాయాలన్న ఆలోచనే మీ చేత ఇంత మంచి కవిత రాయిస్తే ఇంక నిజం గా కవిత రాస్తే ఎలా వుంటుందో.

    ReplyDelete
  3. very good ra... As Radhika mentioned it is very good... Nee Kavi Hrudayam baga spandistundhi.. keep it up buddy.

    ReplyDelete
  4. పొతే పోనివ్వండి చీకటే కదా.మీకు మరి కాసేపు ఎదురు చుసే ఓపిక వుంటే ఆ తర్వాత వచ్చే వెన్నెల ఇంకా అందంగా వుంటుంది కనుక ఆ తర్వాత మీకు వచ్చే ఆలోచనలు ఇంకా అందంగా ఉంటాయేమో

    ReplyDelete