"చాలా కాలమయ్యిందని
ఏదో ఒకటి రాద్దామని
కలం నింపి అరఠావు పట్టి
పడక కుర్చీ వాల్చి
ఆకాశం వైపు చూస్తూ
ఏమి రాయడమా అని
ఆలోచనలో మునిగి కూర్చున్నా
నాగురించి నేను రాసుకుందామంటే
రహస్యం రాసిపెట్టకూడదే
లోకం గురించి రాద్దామంటే
లోకమేమిటో నాకు తెలియదే
తెలిసిన దాని గురించి రాద్దామని
నాకేమయినా తెలుసునేమొనని
ఆలోచిస్తూ అకాశం వైపు చూస్తూ కూర్చున్నా..
చీకటి పడి ఆకాశం కనుమరుగయ్యింది"