పరిగెత్తే కాలం
పట్టుకోను పరుగులెట్టే మనం
క్షణం తీరికలేని జీవితం
తియ్యటి కబుర్లకి
చిలిపి అలకలకు
విరబూసిన నవ్వులకి
మొహం వాచివున్నాం
తినే తిండి బ్రతకడానికి
పీల్చే గాలీ బ్రతకడానికే
దీనికి అంతమేపుడో?
ఈ పరుగులు ఇక చాలని
బ్రతుకు అనుబవిస్తూ ఆనందిస్తూ
ఇక ఈ క్షణం నాది అని అనుభవించేదేప్పుడో?