Wednesday, July 18, 2007

నడక

నిరాశావాదిని కాను
నిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..
తెలియకుండా జరిగేది పుట్టుక
ఎప్పుడు వస్తుందో తెలియనిది చావు
చావు పుట్టుకుల మద్య వంతెన జీవితం
నిలపలేని నడక సమయం
గడిచే ప్రతి క్షణం గమ్యం వైపే
అనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!