చీ జీవితం
---------------
"చీ జీవితం అనిపిస్తే
మార్చుకో మరి కస్ఠమైనా నష్ఠమైనా
కలిసిరాలేదు అదౄష్ఠం లేదంటవా
ప్రయత్నించావా నువ్వసలు?
మరోసారి ప్రయత్నించు
పొయేదేమున్నది ఎలాగూ 'చీ జీవితమేగా' నీది"
........................................
--------------------
స్వతంత్రులమా మనం?
ఆకలికి బానిసలు సగం మన జనం
లేత వయసులో వెట్టి బానిసలు మన చిన్నారులు
ఇంటా బయటా ఉగ్రవాదుల భయం చెరలో మనం
ఇన్ని లోపాలున్నా మనకెందుకులే అనుకొంటు
ఓరోజున స్వతంత్రం వచ్చిందంటు చప్పట్లు చరచి
ఆంతా బాగుందనుకొని త్రుప్తిపడే మనమా స్వతంత్రులం?
*******************************
ఆశ్రునయనాలతోనా తర్పణ
************************
కాడి పట్టి రక్తం చెమటగ చిందించే రైతుకు
అన్నప్రధాత మన రైతుకు
ఆశ్రునయనాలతోనా తర్పణ
బుజం తట్టి దైర్యం చెప్పు
అన్యాయం ఎదుర్కొనగ చేయూతనివ్వు
రైతు ఎదురునిలిచిన రోజున
కష్ఠంతొ కాయలు కాచిన పిడికిలి బిగించిన రోజున
కాదేది అసాద్యం!!!
**********************
ఆవేశం
----------------------
"ఏదో సాదించాలన్న ఆవేశం
లోకం తీరు చూసి నాశనం చేయాలన్న ఆవేశం
మొసాన్ని నాశనం చెయ్యాలన్న ఆవేశం
కాని ఙ్నానం హెచ్చరిస్తుంది నాశనం మార్గం కాదని
మనసుతో ఆలోచించ వద్దని
మనసు మొసం చెయ్యవచ్చని చెయ్యగలదని
ఆవేశపు జడివానను లక్ష్యం వైపు సారించమని"
************************************
నేను
-----------------------------------------------------------------
" అక్షర కుసుమాలను కూర్చి
మనసు మాటను
మాలగ మలచిన కవిని నేను
అగ్గి రవ్వలను చేర్చి
ఆవేశపు జడివానను
జ్వాలగ మార్చిన విప్లవాన్ని నేను
జన చైతన్యాన్ని మేలుకొల్పి
వాహినిగ మార్చి
మార్గం చూపిన ఆలోచనను నేను
నిరాశను పారదోలగ
నేను వున్నానంటు
దైర్యం చెప్పిన ఆశను నేను
రాజకీయ సరిగమలను
రసరమ్య గీతికగ మలచి
పాలన అందించనున్న రాజకేయుడను నేనే"